మహిళలకు నేస్తం విటమిన్ 'డి'
ఈమధ్య మీకు కాస్త మతిమరపు
మొదలైందా .... అయితే, మీలో విటమిన్ 'డి' శాతం తగ్గి ఉండచ్చు అంటున్నారు
శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మహిళలకు ఈ విటమిన్ చాలా అవసరమట. ఇది సమృద్ధిగా
వున్న ఆహారం తీసుకున్న మహిళల్లో జ్ఞాపకశక్తితో బాటు, ఆత్మవిశ్వాసం కూడా
తొణికిసలాడుతున్నట్టు ఫ్రాన్స్ లో తాజాగా జరిగిన అధ్యయనం చెబుతోంది.
విటమిన్ 'డి' లభించే ఆహారం తీసుకోవడం వల్ల మహిళలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ధృడంగా ఉంటున్నారట. కాబట్టి, ఈ విటమిన్ లభించే ఆహారాన్ని మహిళలు తమ డైట్ లో చేర్చుకోవాలని అధ్యయనకర్తలు సలహా ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహాపై విటమిన్ 'డి' సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు!